Listen to this article

నిజామాబాద్, మార్చి 29 జనంన్యూస్.

జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ప్రస్తుత శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.