

జనం న్యూస్ మార్చి 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర రెండుగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి భారీ గజమాల వేసి ఘనమైన జోహార్లు అర్పించారని, అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా ను ఎగరవేసి మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించి జెండా కు సెల్యూట్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందక పేదలకు ఎటువంటి సహాయo లేకపోవడం చూసి నందమూరి తారక రామారావు పేదల ఆర్తనాధాలను చూసి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ప్రపంచానికే తెలుగు వాడి ఉనికిని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు 4 వ సారి ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని ని అభివృద్ధి చేస్తూ అన్ని జిల్లాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చూస్తూ యువత భవిష్యత్తుకు పరిశ్రమలను తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నారని, పి4 విధానాన్ని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యంతో పేద వర్గాలను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రవీంద్ర అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మాజీ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, కేఎస్ఎన్ రాజు పీలా గోవింద సత్యనారాయణ బుద్ధ నాగ జగదీశ్వరరావు బత్తుల తాతీయ్య బాబు సుందరపు విజయ్ కుమార్ ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మల్ల సురేంద్ర డాక్టర్ కే కే విఏ నారాయణరావు కాండ్రేగుల సత్యనారాయణ బొలిశెట్టి శ్రీనివాసరావు మల్ల గణేష్ కుప్పిలి జగన్ బోడి వెంకటరావు మల్ల శివన్నారాయణ తదితరులు అధిక సంఖ్యలో కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.//