Listen to this article

జనం న్యూస్ – మార్చి30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన నాగార్జునసాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై సమ్మక్క సారక్క దెయ్యాలగండి మూలమలుపు వద్ద జరిగింది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తిరుమలగిరి సాగర్ మండలం, పిల్లి గుండ్ల తండా గ్రామానికి చెందిన సపావత్ బాబురావు వయసు: 28 సంవత్సరాలు, కులం లంబాడా, వృత్తి: వ్యవసాయం అనే వ్యక్తి తన భార్య అనిత, అతని బామ్మర్ది రమావత్ నరేష్ లు ముగ్గురు కలిసి పిల్లి గుండ్ల తండా నుండి నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ లో అతని భార్య అనితకు చూపించడం గురించి ఉదయం అతని యొక్క మోటార్ సైకిల్ నెంబర్ TS 05 EY 4043 పై బయలుదేరి, నాగార్జునసాగర్ నుండి వస్తూ ఉండగా, మార్గమధ్యలో సమ్మక్క సారక్క పుష్కర్ ఘాటు దగ్గర వచ్చేసరికి వారికి ఎదురుగా పెద్దవూర వైపు నుండి వస్తున్న ఇన్నోవా వాహనం నెంబర్ AP-28-AY-5229 గలదాని డ్రైవర్ రేలంపాటి భీమన్న తండ్రి హనుమంతు గ్రామం ఎరుకూరు మండలం మల్లకల్ జోగులాంబ గద్వాల జిల్లా తన వాహనం ఇన్నోవా ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ బాబురావు నడుపుతున్న మోటార్ సైకిల్ ఎదురుగా వచ్చి ఢీకొట్టగా మృతుడు బాబురావు అతని భార్య అనిత ఆమె తమ్ముడు రమావత్ నరేషులు అక్కడికక్కడే రోడ్డుపై పడిపోయారు. బాబురావు తలకు కుడి కాలికి , నుదిటిపై, నరేష్ కు తలకు కుడి కాలుకు, అనితకు నడుముకు ఇతర భాగాలలో అందరికీ తీవ్రమైన రక్త గాయాలు కాగా అట్టి సంఘటన చూసిన జటావత్ గణేష్ అనే వ్యక్తి మృతుడు బాబురావు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, అందరూ కలిసి అక్కడికి వెళ్లి 108 అంబులెన్స్ సహాయంతో నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి బాబురావు అప్పటికే చనిపోయినాడు అని నిర్ధారించినారు. అనిత మరియు నరేష్ లకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కొరకు నల్గొండ ప్రభుత్వ హాస్పటల్ కు తరలించినారు. ఇట్టి ప్రమాదం విషయంలో మృతుడు బాబురావు తండ్రి సపావత్ భాష్య తండ్రి సేవ యొక్క ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని,మృతుడు బాబురావు కి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు అని ఎస్సై వీరబాబు తెలిపారు.