

జనం న్యూస్ మార్చి 29(నడిగూడెం)
నడిగూడెం మండలం లోని నారాయణపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణ పనులను పంచాయతీ కార్యదర్శి పృథ్వీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూలీలు వంద రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ నాగిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రేస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు యన్.వీరారెడ్డి, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.