

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 14, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుందూరు నాగార్జున రెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఐటీ రంగ నిపుణులు గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ వింగ్ మెంబర్, బేస్తవారిపేట మండలం సలకల వీడు గ్రామవాసి బిక్క రామాంజనేయ రెడ్డి. ఈ సందర్భంగా బిక్క రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడు ఉండడం అభినందనీయమని, రాజకీయాలలో నాగార్జున రెడ్డి లాంటి విద్యావంతులు ఉండడం వలన విద్యావంతులు రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపుతారని తెలిపారు. సంక్రాంతి పర్వదినాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.