

జనం న్యూస్ మార్చి 29 నడిగూడెం
మండల వ్యాప్తంగా గ్రామాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మందుబాబులకు మండల సబ్ ఇన్స్పెక్టర్ జి. అజయ్ కుమార్ హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. బహిరంగంగా మద్యం సేవించడం చట్టవిరుద్ధమని, మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు..