

జనం న్యూస్ మార్చి 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలనీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మ సతీష్ అన్నారు. మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ… తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, కలయికే ఉగాది పచ్చడి ప్రత్యేకత అన్నారు. మానవ జీవితంలో కూడా కష్టం, సుఖం ఆనంద, మనశ్శాంతి ఇవన్నీటిని కూడా జీవితంలో ఎదుర్కోవాలని చైత్రమాసంలో నిర్వహించే ఉగాదికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. మూగబోయిన కోకిల గొంతు సవరించుకొని కిలకిల రాగాలు చేసే ఈ ఉగాది ప్రకృతి రమణీయతకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు.