Listen to this article

జనం న్యూస్ మార్చి 29(నడిగూడెం)

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో పెను మార్పులు వచ్చాయని, పేదలకు సంక్షేమ పథకాలు లభించాయని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నడిగూడెం లో పార్టీ కార్యాలయం నందు పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం తర్వాతనే ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగిందన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇప్పటికీ టిడిపి పార్టీని ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుండు నాగేశ్వరావు, పల్లపు నాగేశ్వరావు, బూరుగడ్డ థామస్, దేవరంగుల వీరన్న,జహిర్, చక్రయ్య, దేవరంగుల దుర్గారావు, సీతయ్య, అచ్చయ్య,తదితరులు పాల్గొన్నారు.