

జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :గంజాయి కేసులో అల్లూరి జిల్లా వాసిని అరెస్ట్ చేశామని విజయనగరం 1వ పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 2022లో నమోదైన గంజాయి కేసులో అరెస్ట్ కాబడిన రిపెన్ దాస్, శశికుమార్ ఇచ్చిన నేర ఒప్పంద సమాచారం మేరకు ఏ3గా ఉన్న అల్లూరి జిల్లా మేకవరం పంచాయతీకు చెందిన గోపాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిదన్నారు.