

జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డి అనిల్ కుమార్ (ఎక్స్ – ఎం ఎస్ జి కమాండో) ఆధ్వర్యంలో ఎల్ కోట మండలం, జామి పోస్ట్, వీరభద్ర పేట గ్రామం. వీరభద్ర పేట గ్రామానికి చెందిన దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా, ఇవతల తల్లిదండ్రులకు అవతల భార్యా పిల్లలకు, కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉన్న ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. తమ గ్రామాన్ని అభివృద్ధి మరియు మెరుగుపరుచుకోవాలని. ఆర్మీలో పని చేస్తున్న అందరూ కలిసి సెలవు రావడం జరిగింది. ఆ సెలవులలో ఊరికి చేయూత ఇద్దాము అనే నెపంతో “మెగా ఉచిత వైద్య శిబిరం” ఆర్తో, గైనిక్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఐ & డెంటల్, సుమారు 112 మంది మెడికల్ చెక్ అప్ చేసుకోగా, 28 మంది కంటి ఆపరేషన్ జరపడం జరిగింది. ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆ ఊరిలో ఎంతమంది యువత ఉన్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా 64 యూనిట్లు రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డి అనిల్ కుమార్ (ఎక్స్ – ఎన్ ఎస్ జి కమాండో ) మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమానికి తాను తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు అయి ఉంటారని తెలిపారు. అలాగే సహాయం కోరిన వారికి అన్ని విధాలుగా విజయనగరం అండ్ డిఫెన్స్ అకాడమీ అండగా ఉంటుందని కోరారు.