

జనం న్యూస్ మార్చి 30(నడిగూడెం) హుజూర్ నగర్ లో ఆదివారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు నడిగూడెం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్ళినట్లు మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ లు అన్నారు.రామాపురం, నడిగూడెంలో పార్టీ కార్యకర్తలు వెళ్లే వాహనాలను అధ్యక్షులు వెంకట రెడ్డి,చైర్ పర్సన్ తిరుపతమ్మ సుదీర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం హుజూర్ నగర్ లో సాయంత్రం 5 గంటలకు మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ ప్రారంభ సభకు మంత్రి ఉత్తమ్ దంపతులు ఆదేశాల మేరకు భారీగా జన సమీకరణ చేసినట్లు తెలిపారు.తరలినవారిలో మండల కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.