

జనం న్యూస్ – మార్చి 31- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ మరియు యూనిటీ ఆఫ్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ను అందించారు, పవిత్ర రంజాన్ మాసాన్ని ముగించుకుని రేపు జరుపుకోనున్న రంజాన్ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో పేద ముస్లీం మైనారిటీ లకు రంజాన్ తోఫాను మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్(ఈ ఈ//25) నందు ఇరవై మందికి అందచేశారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు సయ్యద్ షబ్బీర్(ప్రెసిడెంట్) ఎస్.కె గౌస్ (వైస్ ప్రెసిడెంట్) ఎస్.కె అజ్గర్ (సెక్రటరీ) క్యాషియర్ రహమత్ అలి, ఎండి ముజ్జు,సుభాని, ఎండి గని,అన్వర్,హమీద్,ఖాసీం,భాష,చంటి, నాగూర్,ఆర్గనైజర్లు నసీర్, షరీఫ్, మరియు ముస్లిం మైనారిటీ సభ్యులు పాల్గొన్నారు.