Listen to this article

జనం న్యూస్ మార్చి 31 కాట్రేనికోన :కాట్రేనికోన మండలం సత్తమ్మ చెట్టు గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి వారి తీర్థ మహోత్సవం ఉగాది పండుగ సందర్భంగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి స్థానిక భక్తులు సానబోయిన విష్ణుమూర్తి, నాగమణి దంపతులచే ప్రముఖ పురోహిత బ్రహ్మ పెద్దింటి వ్యాస మూర్తి శర్మ ఆధ్వర్యంలో ” వెండి కిరీటమును ” అలంకరింపజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిడి నాగేశ్వరరావు, వాసంశెట్టి రాజేశ్వర రావు, ఉప సర్పంచ్ కముజు మల్లికార్జునరావు, సాన బోయిన లక్ష్మణ్, సానబోయిన సతీష్, వెంకటేశ్వర్లు,గుత్తుల శ్రీను, విత్తనాల బుజ్జి, గుత్తాల శ్రీనివాస్లతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రసాద వితరణ పానకాల పంపిణీ జరిగింది.