

జనం న్యూస్ ;31 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో రెండు రోజుల నేషనల్ సెమినార్ లకు కళాశాల ప్రిన్సిపాల్ చైర్ పర్సన్ డాక్టర్ జి. సునీతగారి ఆధ్వర్యంలో, సెమినార్ కన్వీనర్ డాక్టర్ ఎం. శ్రద్ధానందం రీజినల్ కోఆర్డినేటర్ గారు శ్రీ గడ్డం బాలకిషన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సిద్దిపేట స్టడీ సెంటర్ సీనియర్ ఫ్యాకల్టీ ను నాలుగవ సెషన్ కో-ఆర్డినేటర్ గా ఆహ్వానించారు. స్పెషన్ చైర్మన్ గా డాక్టర్ గోపాల సుదర్శన్ గారు వ్యవహరించారు. ముఖ్యఅతిథి వక్తగా డాక్టర్ ఎంఏ. మాలిక్ నాలుగో సెషన్ అంశము మహిళలు, మైనారిటీస్, థర్డ్ జెండర్ ల పైన చక్కటి తన పరిశోధనా వ్యాసమును స్క్రీన్ బోర్డ్ పై గణాంకాలతో వివరించి వక్తగా అలరించారు. నాల్గవ సెషన్ ముఖ్య అతిథి ఏoఏ. మాలిక్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, డాక్టర్ గోపాల సుదర్శనము, సెమినార్ కన్వీనర్ డాక్టర్ శ్రద్ధానందం గార్లు సెషన్ కో-ఆర్డినేటర్ శ్రీ గడ్డం బాలకిషన్ ను ఘనంగా మేముంటోతో సత్కరించారు. సన్మానం పొందిన గడ్డం బాలకిషన్ మాట్లాడుతూ- మొదటగా ఈ రెండు రోజుల నేషనల్ సెమినార్ సిద్దిపేటలో జరుపుటకు శ్రమ కోర్చి కృషిచేసిన డాక్టర్ శ్రద్ధానందం కన్వీనర్ గారికి అభినందనలు తెలిపారు. నాలుగవ సెషన్ అంశంలో భాగంగా మహిళా, మైనారిటీ, థర్డ్ జెండర్ తో పాటు గిరిజనులు (ట్రైబ్స్) కూడా వస్తారన్నారు. తను అరకులోయ గిరిజన సమాజాలపై పరిశోధనను ఆంధ్ర యూనివర్సిటీలో చేశానన్నారు. వాల్మీకి, భగత, కోయదొర మొదలైన గిరిజనతెగలు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో, గోoడులు ఆదిలాబాద్ జిల్లాలో, శ్రీశైలం నల్లమల అడవుల్లో చెంచులు ఏజెన్సీ ఏరియాలో జీవనం గడుపుతున్నారన్నారు. వీరికి లిపిలేని భాష, పోడు వ్యవసాయము, వివాహ పద్ధతిలో ఓలి(కన్యాశుల్కం) చెల్లించడానికి అబ్బాయి తల్లిదండ్రులు అడవిలో దొరికే చింతపండు, దుంపలు మరియు ఇతరములు కావడిలలో ఇచ్చి, అమ్మాయిని పెళ్లి చేసుకుంటారన్నారు, ఆహార ధాన్యాలను వస్తుమార్పిడి పద్ధతి అనుసరిస్తారన్నారు, కావున వీరు గిరిజనులు కూడా “అట్టడుగు వర్గాల సమానత్వం సమ్మిళిత సమాజానికి” దగ్గరలో ఉన్నారన్నారు. సెమినార్ కన్వీనర్ డాక్టర్ ఎం. శ్రద్ధానందం మాట్లాడుతూ ఈ రెండు రోజుల సెమినార్ కు విచ్చేసిన ముఖ్య అతిథులు, వక్తలు-రిటైర్డ్ ప్రొఫెసర్ శివారెడ్డి, బీసీ కమిషన్ సభ్యురాలు బాల్ లక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి రాము, సీనియర్ జర్నలిస్టు ప్రముఖ వక్త సజయ, ముద్రబోయిన రచన థర్డ్ జెండర్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇంటికాల పురుషోత్తo, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్న మొదలుకొని వారందరూ వారి వారి ఉపన్యాసాలతో విద్యార్థులలో విద్యా మనోవికాసాన్ని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణానికి బాటలు వేసినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు రోజుల నేషనల్ సెమినార్ లో భాగంగా నాలుగవ సెషన్ కో-ఆర్డినేటర్ గడ్డం బాలకిషన్ కు జరిగిన సన్మానమునకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కౌన్సిలర్స్ వీరిని అభినందించారు. వివిధ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు, వివిధ కళాశాల నుంచి వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కళాశాల అధ్యాపక బృందంతోపాటు, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ కౌన్సిలర్స్ మరియు కళాశాల డిగ్రీ, పీజీ విద్యార్థిని, విద్యార్థులు నేషనల్ సెమినార్ లో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.