

జనం న్యూస్ మార్చి 31 కాట్రేనికోన : కాట్రేనికోనలోని రామస్వామి తోటకు చెందిన విశ్రాంత జిల్లా న్యాయమూర్తి నల్ల రాజా ప్రసాద్ బాబా 70. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలను ఆదివారం రామస్వామితోటలో పూర్తి చేశారు .ఆయన గతంలో హైదరాబాద్ ,తెనాలి ,భీమిలి ,గుడివాడ ,గుంటూరు విశాఖపట్నం తదితరచోట్ల న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన మృతిపై స్థానిక సర్పంచి గంటి సుధాకర్ నల్ల నర్సింహ మూర్తి, జగడం బాలయోగి సివి రావు, హరికిషోర్,అప్పాజీ గ్రామస్తులు సంతాపం తెలిపారు