Listen to this article

జనం న్యూస్ మార్చ్ 31 ముమ్మిడివరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు అమలాపురం కొల్లూరి చినబాబు వారి బిల్డింగ్ నందు ఈరోజు ఉదయం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధురి, అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 దేశాలలో 394షోరూమ్ లలో ఆభరణ ప్రియుల మనసులను దోచే విధంగా నాణ్యమైన ఆభరణాలను అందించే సంస్థగా పేరుందని వివాహాది శుభకార్యములకు ద్వార ప్రాంతాలకు వెళ్లి నగలు కొనుక్కోవలసిన అవసరం లేకుండా అమలాపురంలో కొల్లూరి గున్నయ్య వారి బిల్డింగులో మలబార్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యం అని వారన్నారు షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు, పాండిచ్చేరి మాజీమంత్రి మల్లాడి కృష్ణారావు ,మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, గంధం పల్లంరాజు, తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచర్ల వేంకట్రావు (బాబి), కోశాధికారి కంచర్ల కృష్ణమోహన్, లక్కింశెట్టి బాబులు , పోశెట్టి సూరిబాబు వరదా సూరిబాబు, సింగంశెట్టి కుమార్,ఏడిద శ్రీను, తదితరులు ఉన్నారు