Listen to this article

జనం న్యూస్ మార్చి 31 (గొలుగొండ మండలం రిపోర్టర్ పొట్ల రాజా): జనసేన పార్టీ కూటమి నాయకుల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం లింగంపేట నూకలమ్మ తల్లి గుడి వద్ద భక్తులకు డొక్కా సీతమ్మ మజ్జిగ పంపిణీ కార్యక్రమం సోమవారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర , జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి ,జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లాడు సురేష్, గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, లింగంపేట నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కొడమంచిలి వరలక్ష్మి, గొలుగొండ మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు , సీనియర్ నాయకులు రేగుబాల్ల శివ, డాక్టర్ కోన నారాయణరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి ,గొలుగొండ మండల జనసేన నాయకులు కార్యకర్తలు, పాతాళకుశరాజు, బొడ్డు లవ, ప్రసాద్, మర్స స్వామి నాయుడు, మద్దపు కామనాయుడు, మాడెం నాగేశ్వరరావు, పెద్దాడ ప్రసాద, విజయ్ కృష్ణ ,మరిసా వినయ్, కూటమి నాయకులు ,భక్తులు పాల్గొన్నారు.