Listen to this article

నీటి విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు..

రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం..

రైతుల విషయంలో రాజకీయం చేయం..

జనం న్యూస్ // మార్చ్ // 31 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ,ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.వంగపల్లి,నేరెళ్ళ,శనిగరం,గోపాల్ పూర్ గ్రామాల్లో ఉన్న రైతులు సాగునీరుకు ఇబ్బంది పడుతున్నారని ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ప్రణవ్ అక్కడికి స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించారు. చేతికొచ్చిన పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఆ విషయాన్ని ప్రణవ్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి సంభందిత ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేసిన ప్రణవ్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఆయకట్టు పరిధిలో ఉన్న గ్రామాలతో పాటు చెక్ డ్యాం నింపడం వల్ల బావుల్లో సమృద్ధిగా నీరు ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.