

జనం న్యూస్ – మార్చి 31- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నమాజ్ చేసుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు, నిన్న రాత్రి నెలవంక కనిపించడంతో ఈరోజు ఆందోత్సాహాల మధ్య రంజాన్ పండుగను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు, ముస్లిం సోదరులకు నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్, నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు, స్థానిక ఎస్సై సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ శంకర్ పోలీస్ సిబ్బందితో పైలాన్ కాలనీ ఈద్గా వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కార్యక్రమం నిర్వహించారు.