

జనం న్యూస్ జనవరి 15 2025 దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని గోకపసల్ వాద్ గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా ఏటా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రధాన పూజారి నివాసం నుండి పురవీధుల గుండా భాజా భజంత్రీలు డోలు మేళాలతో స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు శ్రీ మల్లికార్జున దేవాలయం దగ్గరికి కొనసాగింది స్వామివారికి అక్కిడి శ్రీకాంత్ రెడ్డి దంపతులచే స్వామివారికి పంచామృత అభిషేకము కళ్యాణ మహోత్సవం కార్యక్రమం కొనసాగింది విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భజన బృందం భక్తి కీర్తనాలతో యువకులు మహిళలు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని సంస్కృతిక కార్యక్రమాలచే భక్తులను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ అక్కిడి కేశవరెడ్డి మాజీ సర్పంచ్ కొండ వేణుగోపాల్ యాదవ్ బిజెపి మండల మాజీ అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ భీమ్ రెడ్డి ఎస్ అనంతయ్య గ్రామ యువకులు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు