

జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు విశాఖలోని సోమవారం కలిశారు.
మున్సిపల్ ఛైర్మన్ సావు మురళీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, ఎమ్మెల్యే బేబినాయన చేస్తున్న అభివృద్ధికి సహకరించడం లేదని సుజయ కృష్ణరంగారావుకు తెలిపారు. అభివృద్ధి చేయడంలో విఫలం కావడంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైట్లు వివరించారు. వైసీపీ మద్దతుతో ఛైర్మన్ పదవి కైవసం చేసుకుంటామని మాజీమంత్రి చెప్పారు.