Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 2, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పాములపర్తి గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉగాది సందర్భంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం పాములపర్తి గ్రామంలో రేషన్ దుకాణం వద్ద తాజా మాజీ సర్పంచ్ తీర్మాల్ రెడ్డి, ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్ బాబు,కృష్ణ రెడ్డి, శేషి మాజీ ఉప సర్పంచ్ పద్మ నర్సింహులు, మర్కుక్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు తండా కనకయ్య గౌడ్, గ్రామ ఉప అధ్యక్షుడు సి హెచ్ మల్లేశ్ ,గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. బాలకృష్ణ, మంగి కిషన్ , మహేశ్ నాగరాజు,ములుగు పరుశరామ్, లక్ష్మణ్, డేగల స్వామి, నాగరాజు గౌడ్, లక్ష్మయ్య,గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు దదితరులు పాల్గొన్నారు