

బిచ్కుంద ఏప్రిల్ 01:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)
జుక్కల్ శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన ప్రజల కొరకు ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజు పత్లాపూర్ గ్రామ రేషన్ షాప్ సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సిద్దప్ప పటేల్ , గ్రామ మాజీ సర్పంచ్ అరుణ్ ,సొసైటీ వైస్ చైర్మన్ యాదరావు , గ్రామ మాజీ ఉప సర్పంచ్ సిదప్ప ,మాజీ ఎంపీటీసీ మల్లికార్జున్ , గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారుతీ, హింగు రాములు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు*.