

జనం న్యూస్ ఏప్రిల్ 1 నడిగూడెం
సైబర్ నేరాలపై యువత అవగాహన కలిగి ఉండాలని నడిగూడెం మండల ఎస్. ఐ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, మన ప్రమేయం లేకుండా ఏదైనా వస్తుంది అంటే దాని వెనుక సైబర్ మోసగాళ్లు ఉన్నారని గ్రహించాలని తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు లేదా స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.