

జనం న్యూస్ ఏప్రిల్ (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రావ్య గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ జాబితాలో 516.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 12 వ ర్యాంకు సాధించింది. శ్రావ్య మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం పొందింది. ఈ సందర్భంగా శ్రావ్య తల్లిదండ్రులు వెంకన్న సుజాత, గ్రామ ఉద్యోగస్తులు, గ్రామస్తులు శ్రావ్యను అభినందించారు.