

ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన
టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి..
జనం న్యూస్ 1 ఏప్రిల్ 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చౌకధరల దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ప్రారంభం చేయడం జరిగింది
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టి పి సి సి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి,ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనరెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నేరవేరుస్తూనే గత ప్రభుత్వాలు చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని పేర్కొన్నారు. సందర్భంగా సన్న బియ్యం పంపిణీ పథకం రాష్ట్ర ప్రజలకు కలిగించే ప్రయోజనాలను వివరించారు. పేద ప్రజలకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం చారిత్రకమని, ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తద్వారా పేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు. టిపీసీసీ సభ్యులు అశోక్ రెడ్డి, మరియు ఇంద్రసేనారెడీ మాట్లాడుతూ. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియమాలు చేపట్టామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పధకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం అమలుతో నిరుపేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అనేది నిరంతరాయంగా కొనసాగుతుందని అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీ పధకం ద్వారా పేద కుటుంబాలకు భారం తగ్గుతుందని తెలిపారు. రేషన్ కార్డులు పంపిణీ చేపట్టి ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ (బక్కి),ఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు సుఖినే సంతాజీ, మాజీ సింగల్ విండో చెర్మన్ గోలి రాజేశ్వరరావు, పొన్నం యువసేన తంగెళ్లపల్లి రమేష్, హింగే శ్రీకాంత్, సీనియర్ నాయకులు పాక రమేష్,అంబాల స్వామి, అంబాల జగన్, మాటూరి సారయ్య, గొడిశాల అర్జున్ గౌడ్, గోడిశాల రాజయ్య గౌడ్, కడారి సురేందర్, అంబాల యువరాజు, ప్రదీప్, బొంకురి ఐలయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు…