

జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించిన డిప్యూటీ సీఎం
రాజీవ్ యువ వికాసం పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం
జనం న్యూస్, ఏప్రిల్ 2,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఆఫ్ లైన్ లో కూడా రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లాల కలెక్టర్లతో రాజీవ్ యువ వికాసం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎస్ శాంతి కుమారితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ,రాజీవ్ యువ వికాసం పథకం క్రింద సర్వర్ పని చేయని పక్షంలో ఆఫ్ లైన్ దరఖాస్తులు స్వీకరించి ఎంపిడిఓ, తహసిల్దార్ కార్యాలయంలో ఆన్ లైన్ దరఖాస్తు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం మానిటరింగ్ కోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారి ప్రత్యేకంగా నియమించాలని డిప్యూటీ సీఎం సీఎస్ కు సూచించారు. ఎస్సి, ఎస్టీ ,బీసి, మైనార్టీ దరఖాస్తులు పరిశీలించాలని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, 2018 లో ఎస్సి, ఎస్టి కార్పోరేషన్ క్రింద దరఖాస్తు చేసుకున్న కొందరికి యూనిట్ మంజూరైనప్పటికి సబ్సిడి విడుదల కాలేదని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకొని సబ్సిడీ మంజూరు కాని దరఖాస్తులను తిరస్కరించి వారు నేడు మరో సారి దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పాత దరఖాస్తుల స్వీకరణకు చేపట్టిన చర్యలను డిప్యూటీ సీఎం కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, జిల్లా బీసి అభివృద్ధి రంగా రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ రవి కుమార్ బవినోద్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
