Listen to this article

బీ ఎస్ పీ పార్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శివకుమార్

కొత్తగూడెం నియోజకవర్గం ఏప్రిల్ 01 ( జనం న్యూస్)


చర్ల మండల కేంద్రంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కొండా కౌశిక్ అధ్యక్షతన మంగళవారం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ హాజరై మాట్లాడుతూ చర్ల మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వరద బాధితులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వీడాలని బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని, ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం చేయలేక పోవడం, ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కనీసం ఒక్కసారి కూడా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు వరద బాధితుల సమస్యని తెలుసుకోవడం కాని, పరిష్కరించడానికి గాని ఏ మాత్రం ప్రయత్నం చేయలేదన్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కి వరద బాధితుల పట్ల పట్టింపు లేదని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ మోసకారి రాజకీయాలను ఓటు ద్వారా ఓడించాలని పిలుపునిచ్చారు. వరద బాధితుల సమస్య పరిష్కారం కావాలంటే బహుజనులు బీసీ, ఎస్ సీ, ఎస్ టీ, మత మైనారిటీల అభివృద్ధి కోరుకునేటువంటి బిఎస్సి ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బీఎస్పీ పార్టీకీ అధికారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా చరణ్, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి గుర్రాల దుర్గాభవాని, భద్రాచలం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్, పార్టీ చర్ల మండలం ఉపాధ్యక్షులు చెన్నం మోహన్, పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేశ్వర్లు, పార్టీ చర్ల మండల కార్యదర్శి నక్కా సాంబయ్య, చర్ల మండల కోశాధికారి పంబి కుమారి తదితరులు పాల్గొన్నారు.