Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను నెల రోజుల్లో పరిష్కారం చేయాలనీ లేకుంటే మే 20న సమ్మెకు చేస్తునట్లు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ తెలిపారు. మంగళవారం మండలం లోని మూలపేట గ్రామం లో జరిగిన భవన నిర్మాణకార్మికులు సమావేశం లో ఆయన మాట్లాడుతూ కార్మికులు పెండింగ్ లో ఉన్న 46 వేల క్లైములు నిధులు మంజూరు చేయాలని, 55 సంవత్సరములు నిండిన ప్రతి కార్మికుడికి 6000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే మాదిరి సంక్షేమ బోర్డు అమలు చేయడంతో పాటు ఈఎస్ఐ(వైద్యం) సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామ సంఘం అధ్యక్ష కార్యదర్శి లు సి హెచ్ రాజు, మారేడి పూడి సత్యనారాయణ మాట్లాడుతూ నిర్మాణకార్మికులు సమస్యల పరిష్కారం కోసం మే నెల 20తేదీ న భవన నిర్మాణ కార్మికులు పనులు నిలుపుదల చేసి ఒక్క రోజు సమ్మె చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమం లో చిన్ని చిన్న, గణేష్, తోట సత్తిబాబు, గులివిందుల రాము నాయుడు, పల్ల నర్సింగ రావు, ఉప్పిలి ఆదినారాయణ, బర్నకాన సత్తిబాబు పాల్గొన్నారు.