

భద్రాచల రామయ్య కల్యానానికి దుబ్బాక నుండి 50కిలోలు
కళశాలలో గోటి తాలంబ్రాలు అందజేసిన కమిటీ సభ్యులు
రామభక్తిలో ముందున్న దుబ్బాక: రామకోటి రామరాజు
జనం న్యూస్, ఏప్రిల్ 2, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)
శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల రామయ్య కల్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు అందించాలని సంకల్ప దీక్షతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది భక్తులచే రామనామ స్మరణ చేపిస్తు గోటి తలంబ్రాలు సిద్ధం చేపించారు. మంగళవారం వారం నాడు దుబ్బాక బాలాజీ దేవాలయాలో గోటి తలంబ్రాలకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు జరిపి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు,కి 50కిలోల గోటి తలంబ్రాలు అందించారు. దుబ్బాక చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వేలాది భక్తులు వడ్లను ఓలిచి అందించిన్నవి. సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కల్యానానికి ముచ్చటగా మూడోసారి అందజేస్తున్నామన్నారు. మొదటి సారి 20కిలోలు, రెండోసారి 150కిలోలు, ఇప్పుడు మూడోసారి 250కిలోలు అందజేస్తామన్నారు. ప్రతి గ్రామాన్ని రామనామంతో తట్టి లేపానని వారిలో రామభక్తిని నెలకొల్పానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఆచ్చి లక్ష్మీ నర్సింహా ఆచార్య, చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, వైస్ చైర్మన్ చింత నాగేందర్, కార్యదర్శి రాజు, ఆలయ పతినిధులు పాల్గొన్నారు.
