Listen to this article

ఆయన చేసిన మంచి శాశ్వతం.

జనం-న్యూస్, ఏప్రిల్ 01, (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్):

గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు. ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు గిద్దలూరు నియోజకవర్గంలో 15 సంవత్సరాల తన రాజకీయ ప్రస్తావన మొత్తము అవినీతి రహిత పరిపాలనతో అన్ని కులాలు మతాలు సమాన భావనతో, పార్టీలో ఉండే ప్రతి చిన్న కార్యకర్తను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత గౌరవముతో ప్రజారంజకంగా, అత్యంత ప్రజాదరణతో పరిపాలించినారు కాబట్టి ఇప్పటికీ గిద్దలూరు నియోజకవర్గ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించినారంటే ఒక రాజకీయ నాయకునికి తమ రాజకీయ జీవితంలో భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరముగా భావించవచ్చు. ఒక రాజకీయ నాయకుడు ఎన్ని రోజులు పరిపాలించాడు అనేది ముఖ్యం కాదు ప్రజలకు తాము చేసిన మేలు వారి హృదయాలలో సుస్థిరం సంపాదించడం అనేది గొప్ప విషయం. అలా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల హృదయాలలో అన్నా రాంబాబు అనే పేరు ఇప్పటికీ సుస్థిరంగా, అత్యంత అభిమానంతో ఉండడము అనేది అన్నా రాంబాబు లాంటి ఒక గొప్ప మనసున్న వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటికీ నియోజకవర్గస్థాయిలో అన్ని పార్టీల నాయకులు వారి కుటుంబంలో ఏ చిన్న శుభకార్యం జరిగిన అన్నా రాంబాబు ఇంటికి వెళ్లి ఆప్యాయంగా సహృదయముతో ఆహ్వానిస్తున్నారంటే నియోజకవర్గ ప్రజలతో అనుబంధం అనేది అన్నా రాంబాబుకు విడదీయరాని అనుబంధంగా మారిపోయిందని చెప్పవచ్చు.

గిద్దలూరు నియోజకవర్గంలో తన 15 సంవత్సరాల రాజకీయ పరిపాలనలో ఎన్నో శాశ్వతమైన మంచి పనులు చేపట్టినారు కాబట్టే ఇప్పటికీ నియోజకవర్గంలో ఆయన చేసిన మంచి శాశ్వతంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుత రాజకీయ నాయకులు అభివృద్ధిని పక్కనపెట్టి సంపద ఎలా సృష్టించాలి అని ఆలోచిస్తుంటే అన్నా రాంబాబు లాంటి అవినీతిరహిత పాలకులు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల నుంచి మున్సిపాలిటీల వరకు తమ పరిపాలనలో సంపూర్ణ అభివృద్ధి చెందిందని ఇప్పటికీ నియోజకవర్గంలోని ప్రజలు గర్వంగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. నియోజకవర్గంలో నిరంతరము ఏ ప్రాంతాలు వెనుకబడినవి ఆ ప్రాంతాల అభివృద్ధి ఎలా చేయాలని అధికారులతో మాట్లాడి ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి పనులు పరుగులు పెట్టించడంలో అన్నా రాంబాబు ఆయనకు ఆయనే సాటి అని చెప్పవచ్చు. నియోజకవర్గంలో ఆయన చేసిన మంచి పనులు ఎక్కడ చూసినా ప్రజలు ఈ పని అన్నా రాంబాబు లాంటి అవినీతి రహిత పాలకుడు కాబట్టే చేపట్టినాడని మరి ఇతర రాజకీయ నాయకులు చెయ్యక పోవచ్చు అని అనుకోవడం అవినీతి రహిత పాలకులకు ప్రజలలో ఎంతో అభిమానం ఉంటుందని గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు చెప్పకనే చెబుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుత రాజకీయాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా అన్నా రాంబాబు లాంటి అవినీతి రహిత, ప్రజారంజిక పాలకులు ఉండడం అనేది మార్కాపురం నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని చెప్పటానికి గర్వంగా ఉంది..