Listen to this article

జనంన్యూస్ 02ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం.


జగిత్యాలజిల్లాపెగడపల్లిమండలం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారాఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ద్, జైన్ మరియు పార్శి),ఈబీసీ లకు చెందిన  నిరుద్యోగ యువత, ఇతరులకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పథకమును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినది. అర్హులైనా అభ్యర్థులు, మీ సేవా ద్వారా online లో Apply చేసుకొని, పూరించిన దరఖాస్తు ఫారమ్‌ల (3) హార్డ్ కాపీలను, అవసరమైన పత్రాలను జత పరిచి మండల ప్రజాపాలన సేవా కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయం లో సమర్పించాలని కోరడమైనది. అవసరమైన పత్రాలు ఇవే.

  • ఆధార్ కార్డు.
  • రేషన్ కార్డు
  • ఆదాయ ధృవీకరణ పత్రం.
  • కుల ధృవీకరణ పత్రం (తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జారీ చేయబడినది).
  • శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు).
  • పట్టాదార్ పాస్‌ బుక్ (వ్యవసాయ పథకాలకు).
  • సదరం సర్టిఫికేట్
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
  • దుర్బల (బలహీన) సమూహ ధృవీకరణ పత్రం (మండల స్థాయి కమిటీ ధృవీకరించబడినది).
    ఆదాయ పరిమితి
  • గ్రామీణ ప్రాంతాలు: సంవత్సరానికి రూ.1,50,000/-.
  • పట్టణ ప్రాంతాలు: సంవత్సరానికి రూ.2,00,000/- (మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు).
  • రేషన్ కార్డు వివరాలను దరఖాస్తు ఫారంలో ఇవ్వాలి మరియు రేషన్ కార్డు అందుబాటులో లేని సందర్భాలలో మాత్రమే, అభ్యర్థులు “మీ-సేవ” జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
    వయోపరిమితి:
  • వ్యవసాయేతర పథకాలకు 21 – 55 సంవత్సరాలు (2024 సంవత్సరం జూలై 1 నాటికి)
  • వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 21 – 60 సంవత్సరాలు (2024 సంవత్సరం  
       జూలై 1 నాటికి)
    నిధుల కేటాయింపు, యూనిట్ ధర, సబ్సిడీ,బ్యాంకు లోన్
    ఇదీ రాయితీ
    1) యూనిట్ ధర Rs.50,000/- వరకు
    100% రాయితీ
    2) యూనిట్ ధర Rs.50,001 నుండి Rs.1,00,000/- వరకు
    90%, రాయితీ 10% బ్యాంక్ రుణం
    3) యూనిట్ ధర Rs.1,00,001 నుండి Rs.2,00,000/- వరకు 80% రాయితీ 20% బ్యాంక్ రుణం
    4) యూనిట్ ధర Rs.2,00,001  నుండి Rs.4,00,000/- వరకు 70% రాయితీ 30% బ్యాంక్ రుణం
    5) దుర్బల (బలహీన) సమూహం
    (Rs.1,00,000/- వరకు)
    100% (90% with 10% ఫ్రొమ్ ఈమ్మెఫ్)
    6) చిన్న నీటిపారుదల (మైనర్ ఇరిగేషన్)
    100% రాయితీ