Listen to this article

ప్రధమ వర్ధంతి సందర్భంగా దాసి సుదర్శనకు ఘనంగా నివాళి

జనం న్యూస్- ఏప్రిల్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-

జాతీయ అవార్డు గ్రహీత,చిత్రకారుడు, కళాకారుడు దాసి సుదర్శన్ ప్రధమ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు నాగార్జునసాగర్ లో దాసి సుదర్శన్ స్మారక చిత్రకళ నిలయాన్ని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణారెడ్డి ప్రారంభించారు. నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని దాసి సుదర్శన్ నివాసాన్ని చిత్రకళా నిలయముగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దాసి సుదర్శన్ సంస్కరణ సమావేశంలో ముఖ్యఅతిథిగా హైదరాబాద్ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ ఎం వి.రమణారెడ్డి మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం ఉన్నవారు సమాజానికి స్ఫూర్తినిచ్చే దీపం లాంటి వారిని, వారిలో దాసి సుదర్శన్ ఒకరని కొనియాడారు. దాసి సుదర్శన్ ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నాడని అన్నారు. దాసీ సుదర్శన్ స్మారక చిత్రకళ నిలయంలో ప్రతి ఏటా ఒకరోజు సాహిత్యపరమైన కార్యక్రమాన్ని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. దాసీ సుదర్శన్ నిలయాన్ని కల్చరల్ సెంటర్ గా ఏర్పాటు చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు. నిర్వహించాలన్నారు. దీనికోసం విశ్రాంత జిల్లా అధికారి రామ్మోహన రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమిటీ దాసి సుదర్శన్ స్మారక చిత్రకళ నిలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.అనంతరం పలువురు దాసి సుదర్శన్ తో తమకు ఉన్న అనుభవాన్ని వ్యక్తపరిచారు. సాహిత్య అకాడమీ సభ్యులు ప్రముఖ సాహిత్య వేత్త ప్రసేన మాట్లాడుతూ దాసి సుదర్శన్ వేసిన చిత్రాలలో తెలంగాణ గడిలో అణిచివేతను తెలియచేసేలా,బాంచన్ దొర బతుకుల పై ప్రతిబింబిస్తాయని విశ్లేషించారు. దాసి సుదర్శన్ ఆశయాలను, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసి సుదర్శన్ సతీమణి స్వతంత్ర, కుమారుడు చక్రవర్తి, ప్రముఖ కారికేచరిస్ట్ శంకర్, కూరెళ్ళ శ్రీనివాస్, ప్రముఖ చిత్రకారులు నరసింహ, విజయ్, ఆనంద్, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు,సాహితీవేత్తలు రఘు,సరికొండ నరసింహరాజు, రామ్మోహన రాజు,పున్న కృష్ణమూర్తి, వేణు సంకోజు, శిల్ప కళాకారుడు శ్యాంసుందర్రావు, హరి,మున్నా, సమతా ప్రసాద్,కిరణమై, కే శ్రీనివాస్, కర్తయ్య, కె. వి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.