

జనం న్యూస్ ఏప్రిల్ 01నడిగూడెం
పేదల ఆకలి తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలం లోని నారాయణ పురం గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించింది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అని, దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా సన్న బియ్యం పథకం ప్రారంభించిందన్నారు.ప్రతి పేదవాడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగిరెడ్డి వెంకటరెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు వీరారెడ్డి,సంఘ బంధం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.