

జనం న్యూస్,ఏప్రిల్01, అచ్యుతాపురం:
మండలం లోని గొర్లి ధర్మవరం పంచాయతీలో గ్రామ సర్పంచ్ గొర్లి అశ్విని మరియు వార్డు సభ్యులు లేకుండానే ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించారని, మండల సమావేశాలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ గ్రామ అభివృద్ధి పనులు కోసం సర్పంచిలను కలుపుకొని వెళ్ళమని చెబుతుంటే అ మాటలను పక్కన పెట్టి మాకు నచ్చిన విధంగా చేస్తామనట్టు గొర్లి ధర్మవరంలో సర్పంచ్ ను కనీసం గుర్తించకుండా ప్రోటోకాల్ పాటించడం మరచి కొందరు తమకు నచ్చినట్లు పనులు చేస్తున్నారని సర్పంచ్ అశ్విని తెలిపారు.