Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని చౌక ధరల దుకాణంలో తహశీల్దార్ ఫర్విన్ షేక్ మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించినప్పటికీ ప్రతి పేదవాడు కడుపునిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో ఉచిత సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. హత్నూర మండలంలో మొత్తం చౌక ధరల దుకాణాలు 38 ఉండగా అందులో 15.275 రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ఉన్నారని.17వేల.22.వందల 30.క్వింటళ్ల బియ్యాన్ని ప్రతి నెల ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రజలకు ఉచిత సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకూడదని ఈ యొక్క పథకంలోని బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అన్నారు. చౌక ధరల దుకాణం వద్ద మట్టి కుండలను ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో. రేషన్ డీలర్లు. బేగరి మల్లేశం.సార రవి కుమార్ గౌడ్. ఆకుల నర్సింలు. జహీరొద్దీన్. కాంగ్రెస్ పార్టీ హత్నూర గ్రామ అధ్యక్షులు నల్లోల్ల పెంటయ్య, తాజా మాజీ ఉపసర్పంచ్ సత్యవతి పేంటేష్. ఉష్ణగళ్ళ భూమయ్య. ఎన్ ఎస్ యు ఐ. సంగాడి జిల్లా ప్రధాన కార్యదర్శి. వల్లి గారి సాయికుమార్. పండుగ రాజు.అధికారులు తదితరులు పాల్గొన్నారు.