

జనం న్యూస్, ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)
హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పీఎస్ పరిధి లో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్మనీకి చెందిన ఓ యువతి నగరాన్ని సందర్శించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చింది. మీర్‌పేట మందమల్లమ్మ సెంటర్ వద్ద గతరాత్రి ఒంటిరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను చూసిన కొందరు కామాంధులు.. తాము లిఫ్ట్ ఇస్తామని యవతిని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు కారులో ఎక్కంది. అనంతరం ఆమెను పహడీ షరీఫ్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే యువకులు ఒక్కొక్కరు వంతులవారీగా బాధితు రాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మెుత్తం ముగ్గురు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఘటన జరిగిన నిర్మానుష్య ప్రాంతంలోనే ఆమెను వదిలేసి పరార య్యారు. ఘటన జరిగిన కాసేపటికి తేరుకున్న యువతి.. నేరు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రెండు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలిస్తు న్నారు. ఆ ఏరియాలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నా రు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.