Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్ పోస్టు వద్ద గంజాయితో కారు వదిలి, పరారైన
నలుగురు నిందితులను అరెస్టు చేసి, 147 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 1న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – రామభద్రపురం పిఎస్ పరిధిలోని కొట్టక్కి చెక్ పోస్టు వద్ద ఫిబ్రవరి 10న రామభద్రపురం ఎస్ఐ వి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా రామభద్రపురం వైపు డిఎల్ 8సి ఎపి 0153 నంబరుగల డస్టర్ కారులో వస్తున్న కొంతమంది వ్యక్తులు 100మీటర్ల ముందు పోలీసులను చూచి, డస్టరు కారును విడిచిపెట్టి, రారయ్యారన్నారు. విడిచిపెట్టిన వాహనాన్ని తనిఖీ చేయగా కారులో 147కిలోల గంజాయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి, పరారైన నిందితుల గురించి దర్యాప్తు చేసి, సాంకేతికత ఆధారంతో నిందితులను గుర్తించి, వారిలో నలుగురు నిందితులు (ఎ-2) ఆనందపురం మండలం దుక్కవానిపాలెం గ్రామానికి చెందిన భోగవిల్లి గోవిందరావు (20సం.లు) (ఎ-3) సగురుపల్లి అనిల్ కుమార్ (29సం.లు) (ఎ-4) బంక రామ సురేష్ (25సం.లు) (ఎ-5) ఎ.ఎస్.ఆర్.జిల్లా ముంచంగిపుట్టి మండలం కిలగడ గ్రామానికి చెందిన అంబిడి బాలరాజు (32సం.లు) అనే వారిని అరెస్టు చేసారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనంతగిరి మండలం శివలింగాపురంకు చెందిన (ఎ-1) శెట్టి ఉమా మహేశ్వరరావు అలియాస్ హుస్సేన్ (42సం.లు) గుర్తించామన్నారు. ఇతనిపై ఇప్పటికే ఎస్.కోట, విశాఖపట్నం సిటీ, అనంతగిరి, హుకుంపేట పోలీసు స్టేషన్లులో 8 గంజాయి కేసులు ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో గంజాయి వ్యాపారం ద్వారా కూడబెట్టిన రూ.2 కోట్ల ఆస్తులను కూడా అటాచ్ చేసామని, ప్రస్తుతం (ఎ-1) శెట్టి ఉమా మహేశ్వరరావు గంజాయి కేసులో అరెస్టుకాబడి జైలులో ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఎ-1 శెట్టి ఉమా మహేశ్వరరావు అలియాస్ హుస్సేన్ ఒడిస్సా రాష్ట్రం జనత్బయలు ప్రాంతానికి చెందిన (ఎ-7) రాజుపంగి వద్ద గంజాయి కొనుగోలు చేసి, ఎ-2 నుండి ఎ-5, ఎ-6 కోగేష్ (ప్రస్తుతం పరారీలో ఉన్నారు)ల సహకారంతో విశాఖపట్నం, ఢిల్లీకి గంజాయిని తరలిస్తుండేవారన్నారు. ఆనందపురం మండలం దుక్కపాలెంకు చెందిన (ఎ-2) భోగవిల్లి గోవిందరావు, (ఎ-3) సగురుపల్లి అనిల్ కుమార్, (ఎ-4) బంక రామ సురేష్ లు గంజాయిని అక్రమంగా తరలించడంలో క్రియాశీలకంగా పని చేసేవారన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కిలగడ గ్రామానికి చెందిన (ఎ-5) అంబిడి బాలరాజు (ఎ-1) శెట్టి ఉమా మహేశ్వరరావు (ఎ-7) రాజు పంగి మధ్య గంజాయి కొనుగోలు, విక్రయాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే వారన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎ-6 కోగేష్ ఫిబ్రవరి 9న గంజాయి అక్రమ
తరలింపులో పాల్గొని, కొట్టక్కి చెక్ పోస్టు వద్ద డస్టరు కారును వదిలి పారిపోయిన వ్యక్తుల్లో ఒకరని, ఎ-3, ఎ-4లో
కలిసి కారులో ప్రయాణించారన్నారు. అదే విధంగా ఫిబ్రవరి 25న ఎ-1 శెట్టి ఉమా మహేశ్వరరావు ఎ-7 రాజు పంగి వద్ద నుండి గంజాయిని ఎ-5 అంబిడి బాలరాజు సహకారంతో కొనుగోలు చేసి విశాఖపట్నంకు గంజాయిని తరలించా రన్నారు. మార్చి 1న ఎ-2 నుండి ఎ-4 నిందితులు పాడేరు నుండి ఢిల్లీకి రెండు కార్లలో గంజాయిని తరలించినట్లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులు (ఎ-6, ఎ-7)లను అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా, కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో గంజాయి విక్రయించిన, కొనుగోలు చేసిన, అక్రమ రవాణకు కారకులైన, మధ్యవర్తిత్వం వహించిన నిందితుల మిస్టరీ చేధించి, అరెస్టు చేసి, 147 కిలోల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు, డస్టరు కారును సీజ్ చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, బొబ్బిలి రూరల్ సిఐ కె.నారాయణరావు, రామభద్రపురం ఎస్ఐ వి.ప్రసాదరావు, రామభద్రపురం కానిస్టేబుళ్ళు వై.రమేష్, ఎస్.రవి, ఎ.ధర్మారావు, పి.నాగార్జునలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, బొబ్బిలి రూరల్ సిఐ కే.నారాయణరావు, ఎస్బీ సిఐలు ఎ.వి. లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, రామభద్రపురం ఎస్ఐ వి.ప్రసాదరావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.