Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ అల్లెం అప్పయ్య అన్నారు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డు లను పరిశీలించారు రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయని ప్రజలు వడదెబ్బలపై అప్రమత్తంగా ఉండాలన్నారు గ్రామాలలో ఆశ వర్కర్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు నిల్వ ఉండాలని తెలియజేశారు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్ నిర్వహిస్తున్నందున మహిళలకు అందిస్తున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు పి హెచ్ సి కి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని తెలిపారు రోగులతో మర్యాదగా మాట్లాడాలని అన్నారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి చూసుకోవాలన్నారు ప్రాథమిక ఆరోగ్య పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలిని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయికృష్ణ ఆరోగ్య సిబ్బంది ఆశ వర్కర్లు ఉన్నారు….