

జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం రైల్వే స్టేషన్‌లో నాగావళి ఎక్స్‌ప్రెస్ బుధవారం పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న రైలు చివరి రెండు బోగీలు వెంకటలక్ష్మీ థియేటర్ జంక్షన్ వద్ద పట్టాలు తప్పాయి. రైలు నెమ్మదిగా వెళ్లడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రైల్వే అధికారులు పట్టాలు తప్పిన బోగిలను తప్పించి రైలును పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.