

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 2
తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామ ఇలాకా లో గల రెవిన్యూ భూ రీ సర్వే పై తహసీల్దార్ యూ విజయ భాస్కర్ రీ సర్వే అవగాహన ర్యాలీ ని చెన్నారెడ్డిపల్లి గ్రామం లో నిర్వహించారు అనంతరం చెన్నారెడ్డిపల్లి గ్రామ సచివాలయం లో రీ సర్వే పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి భూ యజమానులు రీ సర్వే ని సద్వినియోగం చేసుకోవాలని 3/4/2025 బుధవారం నుండి ప్రతి రైతుకు దశల వారీగా నోటీసులు ఇచ్చి రీ సర్వే చేస్తామని, వివాదంలో ఉన్న కోర్టు లో ఉన్న భూములను డిస్ప్యూట్ లో ఉంచటం జరుగుతుంది అని అన్నారు మొత్తం 3651 ఎకరాల భూమి కలదని 365 సర్వే నంబర్లు కలవని అందులో ప్రభుత్వ భూమి 1385.63 ఎకరాలు, పట్టా భూమి 2150 ఎకరాల భూమి కి రీసర్వే కలదని తెలిపారు ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు కుందురు సత్యనారాయణ రెడ్డి, కోటపాటి వెంకటరెడ్డి, అరికట్ల వెంకటేశ్వర రెడ్డి,మండల సర్వేయర్ శ్రీవాణి,వి ఆర్ ఓ శివకాసి,మల్లిఖార్జున, సర్వేయర్లు ఎర్వ మస్తాన్, బీసా మణిక్రిష్ణ, గోలమారి రవీంద్ర రెడ్డి, టి వెంకటరెడ్డి, టి వెంకటరెడ్డి గ్రామ రైతులు పాల్గొన్నారు
