

గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ (జమ్మికుంట)..
సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన గండి రంజిత్ కుమార్ గౌడ్ ను హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు శాలువాతో ఘనంగా సన్మానించారు.సర్వాయి పాపన్న 315 వ వర్ధంతి సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తాడిచెట్టు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ ప్రణవ్ బాబుకు విన్నవించారు. గత ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ ప్రభుత్వమైనా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాలో గీత కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో తాడిచెట్టు ప్రమాదంలో చనిపోయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు కూడా ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రాకపోవడం బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందే విధంగా కృషి చేయాలని ప్రణవ్ కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్,, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి మల్లయ్య, ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దేశినీ కోటి ,మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ గౌడ్ లు ఉన్నారు.
