

ముఖ్య ఆదిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
సర్దార్ సర్వాయి పాపన్న పెరు జనగామ జిల్లాకు పెట్టాలి..
జక్కే వీరస్వామి గౌడ్
సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్దంతి వేడుకలు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనoగా నిర్వహించారు.ఈ వేడుకలకు సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ ముఖ్య ఆదిథిగా హాజరై పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడుతు రాష్ట ప్రభుత్వం పాపన్న జయంతి వర్దంతి వేడుకలు చేయటం హర్షించ దగ్గ విషయం అన్నారు.సమైక్య రాష్టంలో తెలంగాణ యోధులకు సరైన ప్రాధాన్యత లేకుండా పోయేదని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో పాపన్న కు సరైన గుర్తింపు వచ్చిందని పాపన్న ఛత్రపతి శివాజీ సమకాళికుడని చరిత్రలో అతనికి తగిన గుర్తింపు లేదని, అందుకే పాఠ్యపుస్తకాల్లో అతని పూర్తి జీవిత చరిత్ర పెట్టాలని , అప్పుడే బావి తరాలకు అతని గురించి తెలుస్తుందని ఒక బీసీ బహుజన వీరుని పోరాట స్ఫూర్తి నాటి రాచరిక నియంత పాలకు చరమ గీతం పాడి పేదల పక్షాన నిబడి కోట్లాది రాజ్యాధికారం చేజిక్కించుకొని పరిపాలించి సామాజిక న్యాయం సమన్యాయం పాటించాడని వీరస్వామి గౌడ్ కొనియాడారు.పాపన్న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయి పేట గ్రామంలో పుట్టటం కరీంనగర్ జిల్లాకే గర్వకారణం అన్నారు. రాష్ట ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న, పెరు పెడతామని హామీ ఇచ్చారని, ఇంత వరకు కూడా పెట్టటం లేదని అన్నారు.ఈ వేదిక ద్వారా రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుక పోవాలని జిల్లా కలెక్టర్ కి సూచించారు.అనంతరం అలుగునూర్ బ్రిడ్జి పై నున్న పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జిల్లా ఆబ్కారీ శాఖ సూపరిండెంట్ శ్రీనివాస్ సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట సోషల్ మీడియా కన్వీనర్ గణపతి, రాజ్ గౌడ్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఆదిపెళ్లి శ్రీనివాస్ గౌడ్ , జిల్లా గౌడ సంఘాలనాయకులు తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్, మాచర్ల అంజయ్య గౌడ్, తాళ్ళపెళ్లి హరికుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘాల నాయకులు గణగాని సత్తన్న గౌడ్, సంపూనురు మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
