Listen to this article

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్)

జనం న్యూస్, ఏప్రిల్ 2, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం

మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎర్ధండి గ్రామంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ సన్న బియ్యం కార్యక్రమం అమలు చేయడం జరిగింది లబ్ధిదారులకు సన్న బియ్యమును అధికారుల సమక్షంలో పంచడం జరిగింది అనంతరం నచుపల్లి నాయకులు రాజ్ కుమార్ నర్సక్కలు పాల్గొని పేదవాళ్ల కల నెరవేరినందుకు ఆనంద వ్యక్తం చేశారు అనంతరం లబ్ధిదారులతో కలిసి సీట్లు పంచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి మరియు జువ్వాడి నర్సింగారావుకి కృష్ణా రావుకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనోజ్ మరియు మాజీ సర్పంచ్ చిన్న రాజన్న డీలర్ అనురాధ గట్ల సుధాకర్ కారోబర్ రతన్ సేరా గంగాధర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు