

జనం న్యూస్ మార్చి ఏప్రిల్ 02(నడిగూడెం)
భద్రాచలం రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి చేరుస్తుందని బుధవారం నడిగూడెం మండలం సిరిపురం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ షేక్ నజీరుద్దీన్ తెలిపారు. భక్తులు అంతరాలయ అర్చన తలంబ్రాలకు రూ.450లు, ముత్యాల తలంబ్రాలకు రూ.150లు చెల్లించి పోస్టల్ ప్రత్యేక బుకింగ్ కౌంటర్ నందు బుక్ చేసుకున్నట్లయితే వారి చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి పంపిస్తుందని తెలిపారు.