

జనం న్యూస్– ఏప్రిల్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
మార్చి 21 నుండి ప్రారంభమైన పదవ తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. చివరి పరీక్ష వ్రాసిన అనంతరం విద్యార్థులు ఆనందంతో వెను తిరిగారు. మొత్తం 317 మంది విద్యార్థులకు గాను స్థానిక నందికొండ మున్సిపాలిటీ పరిధిలో రెండు పరీక్షా కేంద్రాలను అధికా రులు ఏర్పాటుచేయగా అందులో స్థానిక సెయింట్ జోసఫ్ పాఠశాలలో 200 మంది విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 117 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసారు. రెండు పరీక్షా కేంద్రాలలో కలిపి పూర్తి స్థాయిలో 317 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సైన్స్ పేపరు మినహా మిగతా పరీక్షలన్నీ ఉదయం 9.30 నిముషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు కొనసాగింది. వార్షిక పరీక్షలు ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం రెండు పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అటుపోట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించామని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు.