

బిచ్కుంద ఏప్రిల్ 2 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం.. మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్, బీజేపీ నాయకులు అరుణ్ పటేల్, బిచ్కుంద మార్కెట్ కమిటీ సెక్రటరీ రాజ్ కుమార్ చేతుల మీదుగా హిందూ ధర్మం ఉగాది పంచాంగం ఆవిష్కరణ చేయడమైనది,. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ఉగాది పండుగ కొత్త సంవత్సరము శుభ సూచకంగా మరియు హిందూ సాంప్రదాయం ప్రకారము ఉగాది పంచాంగంలో భవిష్యత్తు కార్యచరణ గురించి ఎలా నడుచుకోవాలో కష్టసుఖాలను ఎలా ఎదుర్కోవాలో మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఆచరించాలి వివరంగా ఉంటాయి అన్నారు. అలాగే పండుగలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడూ పూజలు చేయాలి, శుభకార్యాలు శుభమూర్తాలు గురించి ఉగాది పంచాంగంలో వివరంగా ఉంటాయని అన్నారు. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా నీ రూపొందించుకోవాలో వివరంగా తెలియజేస్తారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీవీ5 ప్రతినిధి శంకర్ తదితరులు పాల్గొన్నారు.