

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్
జనం న్యూస్ ఏప్రిల్ 03 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, అన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం రూపొందించిన ప్రతిష్టాత్మక రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన లభిస్తోందని అయన అన్నారు. రాష్ర్టంలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేతృత్వంలో రూపొందించిన ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం 3 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనుందని ఇందులో 60 శాతం నుంచి 80% శాతం వరకు రాయితీ లభిస్తుందన్నారు. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల మేర ఈ రుణాలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అర్హులైన ప్రతి ఒక్కరు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ అమలు చేయడం రాష్ట్ర జనాభాలో 85 % శాతం మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు అని అన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. నిరుద్యోగ యువతకు ప్రోత్సాహకంగా రాజీవ్ వికాసం, పేదలకు కడుపునిండా అన్నం పెట్టేందుకు సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.