Listen to this article

ప్రతి పేదవాడికి కడుపు నింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.

జనం న్యూస్, ఏప్రిల్ 2,జూలూరుపాడు(రిపోర్టర్ జశ్వంత్):

ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చి కడుపు నింపడమే లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైరా నియోజకవర్గంలో మండల పరిధిలో జూలూరుపాడు, మాచినిపేట ప్రభుత్వ చౌక దుకాణంలో కాంగ్రెస్ పార్టీ నిరుపేదల కోసం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ఉచిత సన్నాబియ్యం పథకాన్ని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రాందాస్ నాయక్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు లేళ్ళ వెంకటరెడ్డి మరియు జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు సన్నబియ్యని పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే రేషన్ డీలర్ తో మాట్లాడుతు ప్రజా పంపిణి వ్యవస్థ (పీడీఎస్)కు ఎంత బియ్యం వస్తుంది,ఎంత నిల్వ ఉంటుందని అడిగి తెలుసుకున్నారు ప్రతి నెల కార్డు దారులకు ఎంత సరఫరా చేస్తున్నారని ఆరాతీశారు.త్వరలోనే కొత్త కార్డులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు,మండల నాయకులు, మల్లెల నాగేశ్వరరావు, సపవట్ నరేష్ ,దారావత్ రాంబాబు, దొండపాటి శ్రీనివాసరావు (వాసు), ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, పోతురాజు నాగరాజు,మోదుగు రామకృష్ణ,లకావత లచ్చు నాయక్, ఆర్కే నాయుడు, జగన్, గోపి, మెంతుల కృష్ణ, సతీష్, మిరియాల కిరణ్ కుమార్, వందనపు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ,రాంబాబు, గ్రామస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.