

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
జనం న్యూస్ ఏప్రిల్ 2, 2025:కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.
జిల్లాలో అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణాలను సందర్శించి సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనప కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అర్హత గల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అనిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కెరమెరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం హెల్ప్ బిస్కెట్ ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వేసవి అయినందున సకాలంలో మొక్కలకు నీటిని అందించి రక్షించాలని నిర్వాహకులకు సూచించారు. ఝరి గ్రామంలోని చౌక ధరల దుకాణానికి సందర్శించి సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. కొఠారి గ్రామంలో నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఆసిఫాబాద్ మండలం అడ దస్నాపూర్ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం చేపట్టిన పల్లె దవకానా నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు పల్లె దవాఖాన నిర్మాణం చేపట్టడం జరిగిందని, అధికారులు, గుత్తి దారుల సమన్వయంతో పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

